
మేడిపల్లి, వెలుగు: జిమ్ నిర్వాహకుడిపై నలుగురు వ్యక్తులు డంబెల్స్ తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో కిషోర్ అనే వ్యక్తి జిమ్ నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చంటి అనే అతని పాత స్నేహితుడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు జిమ్ వద్దకు వచ్చాడు.
ఉన్నట్టుండి డంబెల్స్ తో విచక్షణారహితంగా కిషోర్ పై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన కిషోర్ ను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కిషోర్ సోదరుడు కిరణ్ ఫిర్యాదు చేయడంతో మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.