జింఖానా యూత్ ఫుల్ స్పోర్ట్స్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ.. అందరికీ నచ్చుతుంది : హరీష్ శంకర్

 జింఖానా యూత్ ఫుల్ స్పోర్ట్స్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ.. అందరికీ నచ్చుతుంది : హరీష్ శంకర్

మళయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన అలప్పుజ జింఖానా మూవీ తెలుగులో రిలీజ్ కాబోతుంది.. ఏప్రిల్ 25న ధియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. ట్రైలర్ ద్వారా మూవీపై విపరీమైన ఆసక్తి పెరిగిందని.. ఇది పక్కా యూత్ మూవీ అని.. స్పోర్ట్స్ కామెడీతో కుర్ర నటులు అదరగొట్టారంటూ చెప్పుకొచ్చారు హరీశ్ శంకర్. జింఖానా మూవీలో కంటెంట్ చాలా చాలా బాగుందని.. తెలుగులో కూడా ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందన్నారు. మూవీ ఏదైనా కంటెంట్ బాగుంటే ముందుకొచ్చి ప్రమోషన్ చేస్తానని.. ఈ జింఖానా మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఇది కచ్చితంగా ప్రతి యువకుడు చూడాల్సిన మూవీగా భావించానన్నారు హరీష్ శంకర్.

యాక్టర్ నస్లెన్ కి కంగ్రాట్స్.. జింఖానా మూవీ చాలా బాగుందన్నారు డైరెక్టర్ అనుదీప్. స్పోర్ట్స్ కామెడీ చాలా బాగా తీశారని.. అందరూ మిస్ కాకుండా మూవీ చూడాలన్నారు అనుదీప్. 

Also Read : పహల్గాంలోనే నా బర్త్ డే చేసుకున్నా

మంజుమల్ బాయ్స్ తర్వాత ఆ స్థాయిలో జింఖానా మూవీ హిట్ అవుతుందన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి. నైజం డిస్ట్రిబ్యూషన్ కి అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని.. తెలుగు ఆడియన్స్ మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారన్నారాయన. మలయాళంలో ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలుగులోనూ అలాంటి పెద్ద విజయం సాధిస్తుందన్నారు. 

ఇక మూవీ డైరెక్టర్ ఖలీద్ రెహమాన్ మాట్లాడుతూ ఇది స్పోర్ట్స్ కామెడీ ఫిల్మ్. చాలా మంచి యాక్షన్ సీక్వెన్స్ లు పాటలు ఉన్నాయని.. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారన్నారు. 

హీరో నస్లెన్ మాట్లాడుతూ ప్రేమలు సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనన్నారు. జింఖానా స్పోర్ట్స్ కామెడీ ఫిల్మ్ అని.. ఇది హీరో సెంట్రిక్ ఫిలిం కాదని.. టీం వర్క్ అని చెప్పుకొచ్చాడు. ఇందులో అందరూ హీరోలే అని.. తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు హీరో నస్లేన్. 

ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన ఈ  మూవీ ఇప్పటికే మలయాళంలో బాక్సాఫీస్ హిట్ కొట్టింది. ఖలీద్ రెహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడీ స్పోర్ట్స్-ప్యాక్డ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 25న తెలుగులో రిలీజ్ అవుతుంది.