
న్యూఢిల్లీ: ఇండియా జిమ్నాస్ట్ ప్రణతి నాయక్.. ఎఫ్‌ఐజీ వరల్డ్ కప్ వాల్ట్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన వాల్ట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో ప్రణతి 13.317 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచింది. అమెరికా జోడీ జైలా హంగ్ (13.783), క్లైరీ పీస్ (13.584) వరుసగా తొలి రెండు ప్లేస్‌ల్లో నిలిచారు. ‘క్వాలిఫికేషన్‌లో ప్రణతి బాగా రాణించింది.
అనుకున్న ప్లాన్స్‌ను సమర్థంగా అమలు చేసింది. ఫైనల్లో మెడల్ గెలిచే చాన్స్ ఉంది’ అని ఆమె కోచ్ అశోక్ కుమార్ వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు కైరోలో జరిగిన వరల్డ్ కప్‌లో విమెన్స్ వాల్ట్ ఈవెంట్‌లో ప్రణతి బ్రాంజ్ మెడల్‌తో మెరిసింది. 2019లో ఉలెన్‌బార్, 2022 దోహా ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ ఆమె కాంస్యాలు సాధించింది.