హెచ్1బీ వీసా కష్టాలకు చెక్..

హెచ్1బీ వీసా కష్టాలకు చెక్..
  • వచ్చే ఏడాది నుంచి తగ్గనున్న వెయిట్  టైమ్.. వచ్చే నెల 1 నుంచి కొత్త రెగ్యులేషన్లు

వాషింగ్టన్: అమెరికాలో పనిచేయాలనుకునే ఇండియన్లకు బిగ్  రిలీఫ్. నాన్ ఇమిగ్రెంట్  వీసా అపాయింట్ మెంట్ల షెడ్యూలింగ్, రీషెడ్యూలింగ్  కోసం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇండియాలో అమెరికా ఎంబసీ కొత్త రెగ్యులేషన్లను జారీచేయనుంది. వీసాల ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, వెయిట్  టైమ్ తగ్గించడానికి ఈ రెగ్యులేషన్లను విడుదల చేయనుంది.

అమెరికాలోని కీలక రంగాల్లో ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేందుకు దరఖాస్తుదారులకు వీలుకల్పిస్తూ హెచ్ 1బీ వీసా ప్రక్రియను మరింత ఆధునీకరించేందుకు డిపార్ట్ మెంట్  ఆఫ్​ హోంల్యాండ్  సెక్యూరిటీ (డీహెచ్ఎస్) కొత్త రూల్స్ ను ప్రకటించిన మరుసటి రోజే ఇండియాలో యూఎస్  ఎంబసీ ఇన్ స్టాగ్రామ్ లో ఈ ప్రకటన చేసింది. ఈ రెండు ప్రకటనలతో వీసాల ప్రాసెసింగ్ కు వెయిట్  టైమ్  తగ్గనుండడంతో భారతీయులకు లబ్ధి కలగనుంది. ‘‘అమెరికా వెళ్లాలనుకునే ప్రతిఒక్క భారతీయుడికీ వీసా అపాయింట్ మెంట్  అందుబాటులోకి తేవడం, వెయిట్  టైమ్  తగ్గించడం వంటివి చేయడానికి మేము కొన్ని మార్పులు చేస్తున్నాం.

కొత్త వీసా అపాయింట్ మెంట్  రూల్స్  ప్రకారం.. అప్లిక్యాంట్లు వారి అపాయింట్ మెంట్  టైమ్ ను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఒక్కసారి మాత్రమే ఎలాంటి అదనపు ఫీజు చెల్లించకుండా రీషెడ్యూల్  చేసుకోవచ్చు. అయితే, రీషెడ్యూల్  చేసుకున్న అపాయింట్ మెంట్  మిస్  అయితే లేదా రెండోసారి రీషెడ్యూల్  చేసుకోవాల్సి వస్తే, అప్పుడు వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మళ్లీ అప్లికేషన్  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో అప్లిక్యాంట్లు తాము రీషెడ్యూల్  చేసుకున్న అపాయింట్ మెంట్లకు అటెండ్  కావాలని కోరుతున్నాం. ప్రతిఒక్కరూ త్వరగా వీసా అపాయింట్ మెంట్లు పొందేందుకు ఈ మార్పులు ప్రాసెసింగ్ ను సులభతరం చేస్తాయి” అని ఎంబసీ వివరించింది. కాగా.. వీసా అపాయింట్ మెంట్  వెయిట్  టైమ్స్ తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నా.. ఇండియన్  అప్లిక్యాంట్లకు ఆ గడువు ఎక్కువగానే ఉంది.  బీ1 లేదా బీ2 విజిటర్  వీసా అపాయింట్ మెంట్లకు వెయిట్  టైమ్  ముంబైలో 438 రోజులు, చెన్నైలో 479, ఢిల్లీలో 441, కోల్ కతాలో 436,  హైదరాబాద్ లో 429 రోజులుగా ఉంది. ఇక స్టూడెంట్  వీసా వంటి ఇతర వీసా కేటగిరిలో వెయిట్   టైమ్  ముంబైలో 193 రోజులు, చెన్నైలో 106, ఢిల్లీలో 150, కోల్ కతాలో 143, హైదరాబాద్ లో 115 రోజులుగా ఉంది.