- పర్యావరణ పరిరక్షణకు హైడ్రా’ తరహా వ్యవస్థ తేవాలి
- ఈపీడీసీ అధ్యక్షుడు హెచ్.రంగయ్య డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు ‘హైడ్రా’ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం కౌన్సిల్ అధ్యక్షుడు రంగయ్య మీడియాతో మాట్లాడారు. చెట్ల పరిరక్షణకు వాల్టా యాక్ట్, ప్లాస్టిక్ నియంత్రణకు మైక్రాన్ నియంత్రణ జీఓలు, పరిశుభ్రత కోసం మున్సిపాలిటీ విభాగం ఉన్నా అధికారుల ఉదాశీనత పర్యావరణానికి పెనుశాపంలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విచ్చలవిడిగా చెట్లు నరికినా, చెరువుల్లో, జలాశయాల్లోకి రసాయనాలు వదిలినా గుర్తించే వ్యవస్థ లేకుండా పోవడం దురదృష్టకరమన్నారు. నెల కింద ఏర్పాటైన హైడ్రా అద్భుతాలు చేస్తోందని, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరారు.