ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం ఇన్‌ఫ్లుయెంజా. దీంతో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రి పాలవుతున్నారు. అయితే దీనంతటికీ కారణం ఈ వైరస్ గత ఆరు నెలల్లోనే ఊహించని రీతిలో రూపాంతరం చెందడమేనని నిపుణులు చెబుతున్నారు. హెచ్3ఎన్2 ప్యాటర్న్ చాలా మారిపోయిందని వైద్యులు కూడా వెల్లడిస్తున్నారు. అందులో భాగంగానే ఇన్ ఫ్లుయెంజాతో ఆసుపత్రిలో చేరడం అనేది మొదటి ప్రక్రియ అని.. ఆ తర్వాత ఇప్పుడు దీని వల్ల వైరస్ సబ్‌టైప్ హెచ్3ఎన్2 వల్ల చాలా మందికి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నట్టు వైద్యులు తెలిపారు. టైప్ బీ వైరస్ వల్ల కూడా తీవ్ర శ్వాసకోశ సమస్యలు ఎదురవుతున్నట్టు ప్రకటించారు.
ఈ ఇన్ఫెక్షన్లు అధికమైతేPICU (పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది న్యుమోనియా తరహా లక్షణాలను కలిగి ఉంటుందని అంటున్నారు. అంతే కాదు కొన్ని సార్లు ఈ సమస్య మరీ ఎక్కువైతే వెంటిలేటర్ కూడా ఉపయోగించాల్సి రావొచ్చని చెబుతున్నారు.
భారతదేశంలో H3N2 ఫ్లూ వైరస్ కారణంగా ఇప్పటికే హర్యానాలో ఒకరు, కర్ణాటకలో ఒకరు. చనిపోయిన వీరిలో ఒకరు 82ఏళ్ల వ్యక్తి ఉండగా.. అతనికి జ్వరం, గొంతు నొప్పి, దగ్గు ఉన్నాయని డాక్లర్లు తెలిపారు. అతన్ని ఫిబ్రవరి 24న ఆసుపత్రికి తీసుకెళ్లగా, మార్చి 1న హసన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మరణించాడు.