పేరు, పరపతికోసం 22యువకుడు యాపిల్ కంపెనీకి థమ్కీ ఇచ్చాడు. నార్త్ లండన్ కు చెందిన కెరెం అల్బయార్క్ (22) 2017లో నాకు 5కోట్ల క్రిప్టో కరెన్సీ ఇస్తారా..? లేదంటే మీ 319మిలియన్ల అకౌంట్లను క్లోజ్ చేస్తానంటూ యాపిల్ కంపెనీ బెదిరించాడు.
నా అవసరాలు తీర్చండి లేదంటే మీ అకౌంట్లను ఆన్ లైన్ లో అమ్ముకుంటా. కావాలంటే చెక్ చేసుకోండి అంటూ 2017లో యాపిల్ సెక్యూరిటీ క్లైమింగ్ విభాగానికి మెయిల్ పెట్టాడు.
మెయిల్ బెదిరింపుల్నియాపిల్ సంస్థ పట్టించుకోలేదు. వారం రోజుల తరువాత మరో మెయిల్ పెట్టాడు. రెండు అకౌంట్ల నుంచి మీ ఐ క్లౌడ్ అకౌంట్లలోకి ఎంటర్ అవుతానని చెప్పాడు. అన్నట్లుగానే అకౌంట్లలోకి ఎంటర్ అయినట్లు ఇండికేషన్స్ పంపించాడు.
దీంతో అప్రమత్తమైన యాపిల్ యాజమాన్యం యూకే, యూఎస్, బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల్ని సంప్రదించింది.
ఎన్ సీఏ అధికారులు విచారణలో భాగంగా హ్యాకర్ ను నార్తన్ లండన్ లో అదుపులోకి తీసుకొని కోర్ట్ లో హాజరుపరిచారు.
విచారణ చేపట్టిన కోర్ట్ హ్యాకర్ కు 2సంవత్సరాల జైలు శిక్ష, 300గంటల పాటు ఉచితంగా పనులు చేయడం, ఆరు నెలలు ఎలక్ట్రిక్ కర్ఫ్యూ విధిస్తూ తీర్పిచ్చింది.
ఈ సందర్భంగా సీనియర్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ మాట్లాడుతూ హ్యాకర్ రెండూ అకౌంట్లనుంచి హ్యాక్ చేసి పెద్దమొత్తంలో డిమాండ్ చేసినట్లు చెప్పాడు. అయితే హ్యాకర్ పేరు, ప్రతిష్టలకోసం ఇదంతా చేసినట్లు అర్ధమవుతుందన్నారు.