స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ డేటా.. టెలిగ్రామ్లో అమ్ముతున్నారు

స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ డేటా.. టెలిగ్రామ్లో అమ్ముతున్నారు

దేశంలో అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ డేటాను హ్యాకర్లు దొంగించారు..డేటాను టెలిగ్రామ్ లో అమ్ముతున్నారు. స్టార్ హెల్త్ ద్వారా మెడికల్ రిపోర్టులతో సహా డేటాను దొంగిలించి టెలిగ్రామ్ లోని చాట్ బాట్ ల ద్వారా పబ్లిక్ గా యాక్సెస్ చేయబడటం ఆందోళన కలిగిస్తోంది. 

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఆరోపణలు వచ్చిన కొద్ది రోజుల తర్వాత స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ డేటా స్టీలింగ్ వ్యవహారం బయటపడటంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. 

స్టార్ హెల్త్ కు చెందని లక్షలాది మంది వ్యక్తులు హెల్త్, ప్రైవేట్ డేటా అమ్మకానికి ఉన్నాయని ఒక సెక్యూరిటీ రీసెర్చర్ ద్వారా చాట్‌బాట్ సృష్టికర్త ఈ విషయం మీడియాకు తెలియజేయడంతో మిలియన్ల మంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయానికి ఉంచినట్లు వెల్లడైంది.