బిలియన్‌ డాలర్ల దిశగా హాయిర్‌ ఇండియా

బిలియన్‌ డాలర్ల దిశగా హాయిర్‌ ఇండియా

7 వేల కోట్ల దిశగా హాయిర్‌‌ ఇండియా

షాంఘై : చైనా ఎలక్ట్రా నిక్స్‌‌ దిగ్గజం హాయిర్‌‌ గ్రూప్‌‌ తమ ఇండియా యూనిట్‌‌ 2020 నాటికి రూ. 7 వేల కోట్ల కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. హోమ్‌‌ అప్లయెన్సెస్‌ మార్కెట్‌‌లో టాప్‌‌ 3 స్థానం సాధించాలని నిర్దేశించుకుంది. ఇప్పుడున్న విభాగాలకు తోడుగా స్మార్ట్‌‌ హోమ్స్‌‌ సొల్యూషన్స్‌‌, స్మార్ట్‌‌ లాండ్రీ బిజినెస్‌ లో ప్రవేశించాలని భావిస్తోంది. రాబోయే రెండేళ్లలో బిలియన్‌ డాలర్‌‌ కంపెనీగా ఇండియాలో ఎదగాలని ప్రయత్నిస్తున్నట్లు హాయిర్‌‌ ఇండియా ప్రెసిడెంట్‌‌ ఎరిక్‌‌ బ్రిగాంజా చెప్పారు.

2018లో కంపెనీ 50 శాతం వృద్ధితో రూ. 3,500 కోట్ల టర్నోవర్‌‌ సాధించింది. ఇండియాలోని డ్యూరబుల్స్‌‌ కంపెనీల జాబితాలో టాప్‌‌ 5 లో స్థానం పొందినట్లు బ్రిగాంజా తెలిపారు. 2019లో 35 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. యుపిలోని గ్రేటర్‌‌ నోయిడా వద్ద రూ. 3 వేల కోట్ల వ్యయంతో రెండో తయారీ యూనిట్‌‌ను ప్రస్తుతం హాయిర్‌‌ నెలకొల్పుతోంది. ఈ ప్లాంట్‌‌ 2020 చివరి నాటికి ఉత్పత్తికి సిద్ధం కానుంది. పుణెలోని మొదటి ప్లాంట్‌‌ విస్తరణ కోసం రెండేళ్ల కిందట రూ. 600 కోట్లను హాయిర్‌‌ వెచ్చించిం ది. ఇండియా మాకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన మార్కెట్‌‌గా భావిస్తున్నామని, అందుకే పెట్టుబడులు పెంచుతున్నామని హాయిర్‌‌ గ్రూప్‌‌ సౌత్‌‌, సౌత్‌‌ ఈస్ట్‌‌ ఏషియా మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ సాంగ్‌‌ యుజున్‌ తెలిపారు. కంపెనీకి ఇండియాలో 17 వేల మంది డీలర్లుండగా, వీరిలో రెండు వేల మంది డైరెక్ట్‌‌ డీలర్లు.