కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన

కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన

కామారెడ్డి​, వెలుగు: కామారెడ్డి జిల్లాలో  శుక్రవారం వడగండ్ల వాన కురిసింది.   మాచారెడ్డి మండలంలోని సోమార్​పేట, వెనుక తండా, అంకిరెడ్డిపల్లి తండాల్లో బలమైన ఈదురుగాలులతో  కూడిన వడగండ్ల వాన కురవగా.. ఈదురు గాలులకు ఇంటిపైన ఉన్న రేకులు ఎగిరిపోయాయి.  చెట్లు విరిగి నేలకొరిగాయి.  సోమార్​పేటలో  మామిడి చెట్టు ట్రాక్టర్​పై పడటంతో రవి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్​ ధ్వంసమైంది.   కోతకొచ్చిన వరి పంట నేలకొరిగింది.  ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. వాన నీళ్లలో వడ్లు కొట్టుకుపోయాయి.