
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు1896 మంది రైతులకు చెందిన 2637 ఎకరాల్లో పంట దెబ్బతింది. పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వరి, మొక్కజొన్న, నువ్వులు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, టమాట, బెండకాయ, ఇతర కూరగాయల పంటలు వడగళ్ల వానకు దెబ్బ తిన్నాయి. శనివారం పెద్దపల్లి వ్యవసాయాధికారులు నష్టపోయిన పంటను, రైతులను కలిసి వివరాలు సేకరించారు.