
తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడుతోంది.
మార్చి 21న మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో వడగండ్ల వాన పడుతోంది. ధర్మపురి మండలంలో గాలి దుమారం, వడగండ్లతో కూడిన వర్షం కురుస్తోంది. నేరేల్ల, తుమ్మేనాల, ధర్మపురి, తిమ్మాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో వర్షం పడుతోంది. వడంగండ్ల వానకు పలు చోట్ల మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో భారీ వర్షం పడుతోంది
రానున్నరెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వడగండ్ల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది.