యాదగిరిగుట్టలో వడగండ్ల వాన

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బుధవారం సాయంత్రం వడగండ్ల వాన దంచికొట్టింది. దాదాపుగా అరగంట పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో.. గుట్టపై కొత్తగా ఏర్పాటు చేసిన వీఐపీ దర్శన క్యూలైన్ల పైకప్పు స్వల్పంగా దెబ్బతింది. పలు హోర్డింగులకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చినిగిపోయాయి. స్థానికులతో పాటు నారసింహుడి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో ముందస్తు జాగ్రత్తగా కరెంటు సరఫరాను అధికారులు నిలిపివేశారు. -