హైమన్ డార్ఫ్ భవన నిర్మాణ పనులు కంప్లీట్ చేయాలి

  • ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్

జైనూర్, వెలుగు : హైమన్ డార్ఫ్ భవన్ నిర్మాణ పనులు జనవరిలోగా పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్​ ఆఫీసర్లను ఆదేశించారు. జైనూర్​మండలంలోని మార్లవాయి గ్రామాన్ని ఆమె మంగళవారం విజిట్ చేసి నిర్మాణ పనులను పరిశీలించారు. హైమన్ డార్ఫ్ నివసించిన స్థలంలో ఐటీడీఏ నిధులతో నిర్మిస్తున బిల్డింగ్ లో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జనవరి 11న మార్లవాయిలో డార్ఫ్ దంపతుల వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తామని

అదే రోజు డార్ఫ్ భవన్ ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. యూత్ అసోసియేషన్ సభ్యులు సహకరించి వర్ధంతిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రతిభ, ఐటీడీఏ డీఈ శివప్రసాద్, ఏఈ ఇందల్ సింగ్, ఉప సర్పంచ్ జూగ్నక సావిత్ర, గ్రామ పటేల్ ఆత్రం హన్మంత్ రావ్, ఆశ్రమ స్కూల్ హెచ్ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.