హైనా హల్ చల్.. మూడు దూడలు మృతి

హైనా హల్ చల్.. మూడు దూడలు మృతి

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో పశువులపై గుర్తు తెలియని జంతువు దాడి చేస్తోంది. రెండ్రోజులుగా వ్యవసాయ బావుల వద్ద కట్టేసిన ఆవు దూడలపై దాడి చేయడంతో మూడు దూడలు మృతి చెందాయి. దాడి చేసిన జంతువు హైనా అనే అడవి జంతువుగా గ్రామస్థులు అనుమానిస్తున్నారు. దీంతో వ్యవసాయ బావుల వద్ద పశువులను కట్టేయాలంటేనే రైతులు భయపడుతున్నారు. విషయం అటవీశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు.