Beauty Tips : గోరింటాకులో కాఫీ పొడి కలుపుకుని పెట్టుకుంటే.. తెల్లజుట్టు.. నల్లగా నిగనిగలాడుతుంది తెలుసా..

ఒకప్పుడు నలభైఏళ్లు దాటితే అక్కడక్కడ తెల్ల జుట్టు కనిపించేది. సెలవు రోజునో.. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలోనో కుటుంబసభ్యులతో తెల్ల జుట్టును చేతితో రిమూవ్ చేయించుకొనేవారు.  కాని ఆధునిక కాలంలో పదేళ్లకే జుట్టు తెల్లబడుతుంది.  దీంతో స్కూలుకు వెళ్లే పిల్లలు కొంచెం గిల్టీగా ఫీలవుతున్నారు.  అయితే గోరింటాకుతో వంటింటి చిట్కాలు ఉపయోగించి.. తెల్లజుట్టును నల్లగా చేయవచ్చు.. దీనికి ఏమేమి కావాలి.. ఎలా మిశ్రమం తయారు చేయాలి... తరువాత జుట్టుకు ఎలా పట్టించాలో  తెలుసుకుందాం. . .

జెనెటిక్ సమస్యలతో పాటు, ఆహారంలో ప్రొటీన్, కాపర్ లోపం, హార్మోన్ల సమస్యతో చిన్న వయసులోనే తెల్లవెంట్రుకల సమస్యకు దారితీస్తున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడడం పెద్దపనే. అందుకే హెయిర్ కలరింగ్ చేయించుకుంటారు కొందరు. మరికొందరేమో ఏవేవో హెయిర్ ప్రొడక్ట్స్ కొని వాడుతుంటారు. కానీ వాటిల్లోని కెమికల్స్ జుట్టు కుదుళ్లని బలహీన పరిచి సమస్యను తీవ్రతరం చేస్తాయి. అందుకే ఈ సమస్యకు సహజ పద్ధతిలోనే చెక్ పెట్టాలంటే గోరింటాకుతో ఇంట్లోనే ట్రీట్ మెంట్ ఉంది. ఎలాంటి కెమికల్స్ వాడకుండా చేసే ఈ ట్రీట్మెంట్ వల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి

గోరింటాకుతో..
 
కావాల్సినవి :

  • మెత్తగా రుబ్బిన గోరింటాకు: 10 గ్రాములు
  • కాఫీపొడి: 3 గ్రాములు
  • పెరుగు: 25 గ్రాములు
  • నిమ్మరసం: నాలుగు టీ స్పూన్లు
  • ఉసిరి పొడి: 10 గ్రాములు

తయారీ : ఒక గిన్నెలో గోరింటాకు, కాఫీపొడి, పెరుగు, నిమ్మరసం, ఉసిరి పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు, కుదుళ్లకు పట్టించాలి. అరగంట పాటు అలానే ఉంచి చల్లటి నీటితో శుభ్రంచేసుకోవాలి. ఆ తర్వాత రోజు గోరు వెచ్చని నీళ్లతో గాఢత తక్కువ కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి మూడు నెలల పాటు చేస్తే తెల్ల వెంట్రుకలు రంగు మారతాయి.

-వెలుగు, లైఫ్-