Beauty Tip : జుట్టు ఎడాపెడా రాలిపోతుందా..? బలమైన జుట్టుకు ఈ చిట్కాలు పాటించండి..!

Beauty Tip : జుట్టు ఎడాపెడా రాలిపోతుందా..? బలమైన జుట్టుకు ఈ చిట్కాలు పాటించండి..!


జుట్టు రాలడం అన్నది చాలామందికి ఒక పెద్ద సమస్య.. తల దువ్వితే చాలు కుచ్చులు...కుచ్చులుగా జుట్టు రాలడం, పొద్దున్నే నిద్రలేచి చూస్తే దిండుకు అంటుకొని ఉండటం, చేతివేళ్లను జుట్టులోకి పోనిచ్చి అలా కదిలిస్తే నేలపై రాలడం... ఇలా జుట్టు రాలడం భయాన్ని, ఒత్తిడిని ఒకేసారి తెచ్చి నెత్తిపై పెడుతుంది.

కాకపోతే, జుట్టు రాలిపోతోందంటే అది అన్నిసార్లూ మొత్తానికే రాలిపోతుందని కాదు. ఇది రోజూ జరిగే ప్రక్రియ. రోజుకి 50- నుంచి 100 వెంట్రుకలు రాలడం సాధారణమే. ఈ రాలిపోయిన వెంట్రుకలన్నీ తిరిగిస్తాయి.కాకపోతే ఎప్పుడైతే ఆ సంఖ్య పెరిగి ఎక్కువ జట్టు రాలిపోతుందో దాన్ని సీరియస్ విషయంలా చూడాలి. ఈ కండీషన్ ను టెలిజన్ ఎఫ్లువియమ్ పేరుతో పిలుస్తారు. సాధారణం కంటే ఎక్కువ జుట్టు ఊడిపోవడమన్నది వీళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది .

 

  •  ఒకేసారి 10 కిలోల బరువు తగ్గిసేవాళ్లు 
  • బాలింతలు
  • ఒత్తిడి,  డిప్రెషన్​ లోకి వెళ్లిపోయి బాధపడుతున్నవాళ్లు 
  • తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వాళ్లు. 
  •  ఆపరేషన్ చేయించుకున్నవాళ్లు 
  • పెద్ద జబ్బుల నుంచి తేరుకుంటున్నవాళ్లు.

బాలింతలకు పొట్టు రాలడమన్నది అతి సాధారణం. బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే కాకుండా రెండు, మూడు నెలల తర్వాత ఎక్కువ జుట్టు రాలడం మొదలవుతుంది. ఇది కొద్దిరోజుల్లో సాధారణ స్థితికి వస్తుంది. దీనికి కంగారు. పడొద్దు. ఎప్పుడూ ఒత్తిడిలో ఉండేవాళ్లకు జుట్టు రాలిపోతూనే ఉంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ఒత్తిడిని దూరం చేసుకోవడం ఒక్కటే మార్గం.

కారణాలు ఆవేశం : రోజూ కొన్ని వెంట్రుకలు రాలిపోయి తిరిగి రావడం వేరు. .. జుట్టు పూర్తిగా ఊడిపోతుండటం వేరు...  జుట్టు మొత్తంగా ఊడిపోయే కండీషన్ అనీజెన్​ ఎఫ్లువియమ్​  అని పిలుస్తారు. ఈ కండీషన్లో జుట్టు రాలి పోయిన భాగమంతా బట్ట తలగా మారిపోతుంది. ఇక్కడ మళ్లీ జుట్టురాదు.

జుట్టు రాలడానికి చాలా కారణాలున్నాయి

  • వంశపారంపర్యం 
  • రోగనిరోధక శక్తి ఊహించని విధంగా మార్పులు చెందడం
  • జబ్బులకు ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉండటం 
  • జుట్టును లాగిపట్టునట్టు ఉండే హెయిర్ స్టైల్ 
  •  జుట్టుకు పడని హెయిర్ ప్రొడక్ట్ వాడటం 

ఇలాంటివి రకరకాలు, కీమోథెరపీ, రేడియేషన్ లాంటి ట్రీట్ మెంట్ కి వెళ్లినప్పుడు వాటి ప్రభావం జుట్టుపై ఎక్కువ ఉంటుంది. ట్రీట్ మెంట్ పూర్తయ్యాక మళ్లీ జుట్టు మామూలుగానే తిరిగొస్తుంది. ఏదైనా జబ్బు పడి ట్రీట్ మెంట్ తీసుకుంటుంటే, ఒకవేళ జుట్టు ఎక్కువ ఉడిపోతే డాక్టర్ సలహాలు పాటించాల్సి ఉంటుంది. ట్రీటి మెంట్ మాత్రం అస్సలు ఆపొద్దు. ఇవి కాకుండా ఇంకే కారణాలతోనైనా జుట్టు ఊడిపోతూ ఉంటే ట్రీట్ మెంట్ అవసరం .  వంశపారం పర్యంగా ఇది వస్తే ఆడవాళ్లలో జుట్టు పల్చబడిపోవడం కనిపిస్తుంది. మగవాళ్లలో అయితే అక్కడక్కడా జుట్టు పెరగడం ఆగిపోయి బట్టతల వస్తుంది.

Also Read : చియా గింజలతో ఎన్ని లాభాలో.. ప్రతి ఒక్కరి డైట్లోఉండాల్సిందే..!

ట్రీట్ మెంట్ ఉందా?

జుట్టు ఊడిపోవడం ఎవరికైనా పెద్ద సమస్యే దీనికి ట్రీట్ మెంట్ ఏదైనా ఉందా అని అడిగితే, అది మనిషిని బట్టి మారుతుంది.. కొంతమందికి ట్రీట్ మెంట్ ఫాలో అయితే జుట్టు తిరిగొస్తుంది... డెర్మటాలజిస్ట్ సలహాతో ట్రీట్ మెంట్ కి వెళ్లొచ్చు..  జుట్టు ఎందుకు ఊడిపోతుంది. కారణాలేంటి? అన్నదాన్ని బట్టి వీటికి ట్రీట్ మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్ మెంట్ ఎంత తొందరగా మొదలైతే ఫలితం అంత బాగా ఉంటుంది.

ఇవి తెలుసుకోండి..

  •  మగవాళ్లలో వయను పెరుగుతున్నా కొద్దీ జుట్టు ఊడిపోవడం అన్నది కనిపిస్తుంది. వంశపారం పర్యంగా, హార్మోన్లలో మార్పులకు తగ్గట్టు జుట్టు ఊడిపోతుంది.
  •  ఆడవాళ్లలో జుట్టు పల్చబడటాన్ని చూసి ఈ సమస్య వస్తుందని గుర్తించొచ్చు. ముందు జుట్టు పల్చబడ్డాక మెల్లిగా వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది 
  •  పోలీటెయిల్ హెయిర్ స్టైల్ చేసుకు నేవాళ్లు జుట్టును గట్టిగా లాగిపట్టడం ద్వారా కుదుళు బలం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి కనిపిస్తే వెంటనే హెయిర్ స్టైల్ విషయంలో మార్పులు అవసరం
  •  విటమిన్ ఏ ఎక్కువైనా కూడా కొన్నిసార్లు జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. విటమిన్ బి తగ్గినా కూడా జుట్టు ఊడిపోతుంది 
  • అలో పేషియా అరిటా అనే ఒక వ్యాధి కూడా జుట్టు ఊడిపోవడానికి కారణం కావొచ్చు. ఈ విషయంలో డెర్మటాలజిస్ట్​ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. 

బలమైన జుట్టుకు కొన్ని చిట్కాలు

  • జుట్టు అందంగా, బలంగా ఉండాలనే కోరుకుంటారు ఎవ్వరైనా కొన్ని చిట్కాలను పాటిస్తే, ఏ కారణం లేకుండా రాలిపోయే జుట్టును కాపాడుకోవచ్చు 
  • మీ చర్మం.. తల  ఆయిలీగా ఉంటే ఎక్కువ సార్లు తలస్నానం చేయాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ అయిలీ ఉంటే రోజూ తలస్నానం చేస్తే మంచిది. ఒకవేళ ట్రీట్ మెంట్ తర్వాత మీకు జుట్టు తిరిగొస్తుంటే తరచూ తలస్నానం చేయడం మంచిది కాదు.
  •  వయసు పెరుగుతున్నా కొద్దీ షాంపూ వాడకం తగ్గించాలి. 
  • షాంపూ వాడేటప్పుడు కేవలం జుట్టు పై పైన మాత్రమే రుద్దకుండా తలంతా పట్టించాలి
  •  షాంపూ వాడిన తర్వాత కండీషనర్ కూడా వాడటం అలవాటు చేసుకోండి. ఇది జుట్టును బలంగా ఉంచుతుంది
  •  స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు నీళ్లలో జుట్టు తడవకుండా కాపాడుకోండి. స్విమ్మింగ్ కోసమే వాడే హెడ్ క్యాప్​ధరిస్తే మంచిది

-వెలుగు, లైఫ్​–