హైదరాబాద్, వెలుగు:సింఫనీ లిమిటెడ్ వాటర్ హీటింగ్ సొల్యూషన్స్లోకి ప్రవేశించింది. జుట్టు రాలడానికి కారణాలలో ఒకటైన కఠినమైన నీటిని మృదువైన నీరుగా మార్చే, హానికరమైన రసాయనాలను వడబోసే 9-లేయర్ పురోపాడ్ టెక్నాలజీతో వీటిని విడుదల చేసింది.
వీటిలో సింఫనీ స్పా, సింఫనీ సౌనా, సింఫనీ సోల్ మోడళ్లు ఉన్నాయి. ఇవి 10-లీటర్, 15-లీటర్ 25-లీటర్ల సామర్థ్యంతో వస్తాయి. ఈ గీజర్లకు ఫైవ్ స్టార్ రేటింగ్ఉన్నందున తక్కువ కరెంటును వాడుకుంటాయి. హెవీ-డ్యూటీ హీటింగ్ ఎలిమెంట్, మెరుగైన మన్నిక కోసం టైటానియం ప్రో కోటింగ్, ఎక్కువ ఆయుర్దాయం కోసం మెగ్నీషియం రాడ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
వీటితోపాటు స్మార్ట్ బాత్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇది ఏఐతో భారతదేశపు మొదటి వాటర్ హీటర్ అని సింఫనీ ప్రకటించింది. వినియోగదారులు తమ గీజర్లను దూరం నుంచే కంట్రోల్ చేయవచ్చు. కంట్రోలర్ టైమ్, టెంపరేచర్ కంట్రోల్, జెశ్చర్ కంట్రోల్, చైల్డ్ సేఫ్ మోడ్ ఫీచర్లూ ఉన్నాయని సింఫనీ తెలిపింది.