తెలంగాణ నుంచి హజ్‌‌‌‌‌‌‌‌ యాత్రకు 656 మంది..సెకండ్ వెయిటింగ్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన హజ్ కమిటీ

న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది హజ్‌‌‌‌‌‌‌‌ యాత్రకు తెలం గాణ నుంచి వెయిటింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న 656 మందికి అవ కాశం దక్కింది. వెయిటింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న 1,632 నుంచి 2,288 అప్లికేషన్లకు తాత్కాలిక సీట్లు కేటాయించింది. ఈ మేరకు శనివారం కేంద్ర మైనార్టీ శాఖ ఆధ్వర్యంలోని హజ్‌‌‌‌‌‌‌‌ కమిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా హజ్‌‌‌‌‌‌‌‌ యాత్రికుల సెకండ్ వెయిటింగ్‌‌‌‌‌‌‌‌ లిస్టును రిలీజ్ చేసింది. ఈ లిస్ట్‌‌‌‌‌‌‌‌ లో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు/యూటీల నుంచి 3,676 మంది హజ్‌‌‌‌‌‌‌‌ వెళ్లేందుకు తాత్కాలిక సీట్ల కేటాయింపు చేసినట్లు పేర్కొంది.

ఇందులో తెలం గాణతో పాటు చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నా యి. లిస్ట్‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కిన యాత్రికులు ఈ నెల 23 లో పు రెండు విడతల్లో రూ.2,72,300 హజ్‌‌‌‌‌‌‌‌ కమిటీల కు చెల్లించాలని సూచించింది. హజ్‌‌‌‌‌‌‌‌ యాత్రకు సం బంధిత పత్రాలు అందించేందుకు ఈ నెల 25 వర కు గడువు ఇచ్చారు. వివరాలకు హజ్‌‌‌‌‌‌‌‌ కమిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా డిప్యూటీ సీఈ వో(ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌) మహ్మద్‌‌‌‌‌‌‌‌ నియాజ్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ను +91 9650426727 నంబర్‌‌‌‌‌‌‌‌లో సంప్రదించాలని హజ్‌‌‌‌‌‌‌‌ కమిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా తెలిపింది.