మూసాపేట, వెలుగు: అప్పుల బాధతో హెచ్ఏఎల్(హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్) ఎంప్లాయ్ సూసైడ్ చేసుకున్న ఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లా కోటేశ్వర గ్రామానికి చెందిన మయాంక్ రావత్(35) బాలానగర్‌లోని హెచ్ఏఎల్లో ఎస్జీటీగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య,పిల్లలు ఉన్నారు. మయాంక్ హోటల్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. అప్పులపాలై ఆర్థికంగా ఇబ్బందిపడ్డాడు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి మయాంక్.. హాల్లోనే నిద్రపోయాడు. సోమవారం తెల్లవారుజామున అతడి భార్య నిద్రలేచి చూడగా.. మయాంక్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని గాంధీకి తరలించారు.
ALSOREAD:వివాదాలకు దారి తీస్తోన్న సీఎం కొత్త జిల్లాల ప్రకటన.. గ్రామస్థులపై పోలీసుల లాఠీచార్జి
పేట్ బషీరాబాద్‌లో కార్మికుడు..
జీడిమెట్ల: కార్మికుడు సూసైడ్ చేసుకున్న ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన కాంచన్ బర్మన్(20) బతుకుదెరువు కోసం 20 రోజుల కిందట పేట్ బషీరాబాద్‌కు వలస వచ్చాడు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.