
ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు
గూగుల్ అప్లికేషన్ ద్వారా మే 4వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.
పోస్టు: ట్రేడ్(ఐటీఐ) అప్రెంటీస్ 2025–26
డిపార్ట్మెంట్స్: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, డ్రాట్స్‌మెన్(మెకానికల్), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, మెషినిస్ట్, మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, వెల్డర్, పెయింటర్, ప్లంబర్, మసన్.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 27 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: గూగుల్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంది.
అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 4.
సెలెక్షన్ ప్రాసెస్: 100 శాతం మెరిట్ బేస్డ్పై సెలెక్ట్ చేస్తారు. పదో తరగతిలో సాధించిన మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఐటీఐ ఎగ్జామినేషన్‌లో సాధించిన మార్కులకు 30 శాతం వెయిటేజ్ ఉంటుంది.