రూ.235 కోట్లు సమీకరించిన హల్దీరామ్ భుజివాలా

రూ.235 కోట్లు సమీకరించిన హల్దీరామ్ భుజివాలా

హైదరాబాద్​, వెలుగు : ప్రైవేట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ ద్వారా పాంటోమత్  భారత్ వాల్యూ ఫండ్ (బీవీఎఫ్) నుంచి రూ. 235 కోట్లను సమీకరించినట్లు స్నాక్స్ తయారీదారు హల్దీరామ్ భుజివాలా గురువారం తెలిపింది. 'ప్రభుజీ' బ్రాండ్‌‌‌‌‌‌‌‌తో తమ ఉత్పత్తులను రిటైల్ చేస్తున్న ఈ కంపెనీ తూర్పు,  ఈశాన్య మార్కెట్‌‌‌‌‌‌‌‌ల వెలుపల మార్కెట్లకు విస్తరించడానికి నిధులను ఉపయోగిస్తుంది.  కోల్‌‌‌‌‌‌‌‌కతాకు చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం ప్రధానంగా పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్  

ఈశాన్య రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  అంతేకాకుండా, కంపెనీ 19 రిటైల్ ఔట్​లెట్లను,  60 ఫ్రాంచైజీ స్టోర్‌‌‌‌‌‌‌‌లను నిర్వహిస్తోంది.  హల్దీరామ్ భుజివాలా 6,035 ఎంటీపీఏ సామర్థ్యంతో మూడు తయారీ యూనిట్లను కూడా నడుపుతోంది.  2023–-24లో దేశంలో స్నాక్స్ మార్కెట్ విలువను రూ.42,600 కోట్లుగా అంచనా వేయగా, 2031–-32 నాటికి రూ.95,500 ఇది కోట్లకు చేరుకోవచ్చని కంపెనీ పేర్కొంది.