సంప్రదాయ స్నాక్-ఫుడ్ బ్రాండ్‌లలో ఒకటైన హల్దీరామ్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండే ( ఫ్రోజెన్) “మినిట్ ఖానా” ను విడుదల చేసింది. ఇవి రెండేళ్లపాటు నిల్వ ఉంటాయి. దేశ విదేశాల్లోని తమ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. మినిట్ ఖానాలో స్నాక్స్, స్వీట్లు, ఇతర వంటకాలు ఉంటాయి.
నిజమైన భారతీయ ఆహారం ఆస్వాదించాలనుకునే వారి కోసం మినిట్ ఖానా ఎంతో అనువుగా ఉంటుందని హల్దీరామ్ తెలిపింది.