మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
  • ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు తరగతులు

హైదరాబాద్, వెలుగు: ఎండల నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలోని స్కూళ్లు ఒక్కపూటనే నడవనున్నాయి. ఈ నెల 15 నుంచి ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ స్కూళ్లు నడుస్తాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. 

టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సెంటర్లున్న స్కూళ్లు మాత్రమే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతాయన్నారు. అయితే, టెన్త్ క్లాస్ పిల్లలకు మాత్రం ప్రత్యేక క్లాసులు కొనసాగుతాయని వివరించారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కంటిన్యూ అవుతాయని వెల్లడించారు.