15 నుంచి ఒంటిపూట బడులు
ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలీడేస్
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఒంటి పూట క్లాస్‌లు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని అధికారులు సూచించారు. 2019–20 అకాడమిక్ క్యాలెండర్ ఎప్పటిలాగే కొనసాగుతుందని తెలిపారు. ఈ రూల్స్ ఫాలో కాని స్కూల్స్‌పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 24 నుంచి అన్ని బడులకు వేసవి సెలవులు ఉంటాయని చెప్పారు.