
హైదరాబాద్, వెలుగు: ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల (మార్చి) 15 నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో సర్కారు స్కూళ్లతో పాటు ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.
ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా తెలంగాణలో వెండల తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో హాఫ్ డే స్కూల్స్ ను మార్చి 15 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.