
అమరావతి: రాష్ట్రంలో ఈనెల 4వ తేదీ (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఎండలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు స్కూళ్లు నడుస్తాయని ఆయన తెలిపారు.అలాగే ఈనెల 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని వివరించారు.
ఇవి కూడా చదవండి
అర్హతలేని మనిషి మంత్రి హోదాలో కొనసాగుతున్నడు
మీపై చైనా దాడి చేస్తే.. రష్యా ఆదుకుంటదా?