ఏపీలో ఒంటిపూట బడులు ఆ రోజు నుండే...

ఈ ఏడాది మార్చి ఆరంభం నుండే ఎండలు మండిపోతున్నాయి. ఒంటిపూట బడులు ఎప్పుడు మొదలవుతాయా అని పిల్లలు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణాలో మార్చ్ 15 నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించగా ఏపీలో మాత్రం ఒంటిపూట బడుల విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది మార్చి 15 కంటే ముందుగానే ఒంటిపూట బడులు స్టార్ట్ చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుతం ఏ నిర్ణయం ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో మార్చి 18 నుండి ఏపీలో ఒంటిపూట బడులు స్టార్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. పదో తరగతి పరీక్షలు జరిగే బడుల్లో మధ్యాహ్నం నుండి తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒంటిపూట బదులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పిల్లలు వడ దెబ్బ బారిన పడే ప్రమాదం ఉదని, ఒంటిపూట బడులు త్వరగా ప్రారంభించాలని పలు విద్యారర్థి సంఘాల నాయకులు ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించిన సంగతి తెలిసిందే.