పంచాయతీ వర్కర్లకు హాఫ్​డే వర్క్

పంచాయతీ వర్కర్లకు హాఫ్​డే వర్క్
  • ఎండల తీవ్రత నేపథ్యంలో పీఆర్ శాఖ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ వర్కర్లకు పంచాయతీరాజ్ శాఖ హాఫ్​డే పనిచేసే అవకాశం కల్పించింది. ఎండల తీవ్రత దృష్ట్యా పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది, మల్టీపర్పస్​ వర్కర్లు ఉదయం ఆరు గంటల  నుంచి 11 గంటల వరకు పనిచేసే వెసులుబాటు కల్పించింది. 

ఈ సమయంలో పంచాయతీకి సంబంధించిన పని పూర్తికాకపోతే అవసరమైతే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పనిచేయవచ్చని పీఆర్​శాఖ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది.