
ఈ మధ్యకాలంలో రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది. ఎక్కడిపడితే అక్కడా రీల్స్ చేస్తూ తోటివారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టాలెంట్ నిరూపించుకు నేందు కు కొందరు రీల్స్ చేస్తే.. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లకోసం మరికొందరు ఇష్టం వచ్చినట్లు రీల్స్ చేయడం ఇంటర్నెట్ లో షేర్ చేయడం ఓ హాబీగా మారి పోయింది. ఈ రీల్స్ ను ముఖ్యంగి పబ్లిక్ ప్లేసుల్లో చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తు న్నారు. తాజాగా ఓ యూట్యూబర్..ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్ వీధుల్లో తన వింత చేష్టలతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇందేంపనిరా బాబూ.. అంటే ట్రోల్ చేస్తున్నారు.
రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్న ప్రణయ్ జోషి అనే యూట్యూబర్.. తాజాగా ఢిల్లీలోని సరోజిని నగర్ మార్కెట్లో షర్ట్ ఊడదీసుకొని వీధుల్లో తిరుగడం వీడియోలో కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న బట్టల షాపుల్లోకి వెళ్లి బట్టలు కొనుక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే కొన్ని షాపుల్లో అతడిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. కొన్ని షాపుల ఓనర్లు అనుమతిచ్చారు.
జనంతో నిండిన రద్దీగా ఉండే వీధిలో అతను వెళుతుండగా చాలామంది అతనిని చూసి అసౌకర్యంగా ఫీలయ్యారు. కొంతమంది ఇదేం పిచ్చిరా బాబు అంటూ తిట్టుకున్నారు. కొంతమంది కొట్టేంత పనిచేశారు. అయినా అతను స్పందించకుండా షర్ట్ లేకుండా మార్కెట్ వీధుల్లో తిరిగాడు.
కేవలం రీల్స్ చేసేందుకు ఇలా షర్ట్ లేకుండా ఎక్కువ పబ్లిక్ ఉంటే ప్రాంతాల్లో ఇలా వెళ్లినందుకు నెటిజన్లు ఆ యూట్యూబర్ ను ట్రోల్ చేస్తున్నారు. కొంచెం కూడా సిగ్గులేదా అంటూ తిడుతూ పోస్టులు పెట్టారు. దయచేసి ఇలాంటి వారిని ప్రోత్సహించకండి అంటే పోస్టులు షేర్ చేశారు.
వ్యూస్ కోసం ఏం చేస్తున్నావ్ బ్రో.. అంటూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు. ఏదో ఒక రోజు నిన్ను జనం కొడతారు బ్రో అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం అతని బోల్డ్ నడకను మెచ్చుకున్నారు. హిమ్మత్ హై ప్రణయ్ భాయ్ మే అంటూ ట్వీట్ చేశారు.