మనిషి రోజు మొత్తం ఏ పని చేసినా.. రోజుకు మూడు పూటలు తినడం అయితే సాధారణం.. ఏ ఫుడ్ తింటున్నారు? ఎలా తింటున్నారనేదే ఇక్కడ కొందరికి కోట్లు సంపాధించి పెడుతుంది. ప్రపంచలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్ కావడంతో ప్రపంచ దేశాలకు మంచి మార్కెట్. అయితే సంప్రదాయ పద్దతులను పక్కన పడేసి ఆధునికత వైపు పరుగులు పెడుతున్న భారత్.. అభివృద్ధి చెందిన దేశాల అలవాట్లును ఎక్కువగా ఆచరిస్తుంది. ఈ క్రమంలో వంట వండుకొని తినే కంటే.. తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని అంటే హోటల్స్, రెస్టారెంట్స్ ఫుడ్స్ తినడానికే భారతీయులు ఎక్కువ ఇష్టపడుతున్నారట. ఈ విషయాన్ని సింగపూర్ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్ SATS ఫుడ్ సొల్యూషన్స్ ఓ నివేదికలో తెలిపింది.
Also Read: ఇవి తింటే మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి
రానున్న ఐదు సంవత్సరాల్లో ఇండియాలో రెడీ టూ ఈట్ మార్కెట్ 45శాతం పెరుగుతుందని, ఆ రంగంలో భారీగా పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని SATS ఫుడ్ సొల్యూషన్స్ CEO స్టాన్లీ గోహ్ అన్నారు. బెంగళూర్ కెంపగౌడ ఎయిర్ ఫోర్ట్ లో ఫుడ్ అండ్ గేట్‌వే సర్వీసెస్ ప్రొవైడర్ అనుబంధ సంస్థ SATS ఫుడ్ సొల్యూషన్స్ ఇండియా 300 మందికి ఉపాధి కల్పిస్తుందని భారతదేశ CEO సాగర్ డిఘే తెలిపారు. ఇండియాన్స్ రోజురోజుకు రెడీ టూ హీట్, రెడీ టూ ఈట్ వంటి విధానాలకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆ సంస్థ చెప్తోంది. ఈ రోజుల్లో ఎవరూ స్వయంగా వంట చేసుకొని తినడానికి ఇష్టపడట్లే అని SATS ఫుడ్ సొల్యూషన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.