3 నెలల సాలరీలో సగం చెల్లింపు
40 లక్షల మందికి వర్తింపు
ఈఎస్‌ఐ ప్రకటన
న్యూఢిల్లీ: ఉద్యోగం పోగొట్టుకున్న వారికి సెంట్రల్ గవర్నమెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబరులోపు జాబ్స్ లేని వారికి సాయం చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూల్స్‌ను ఈజీ చేసింది. కరోనా లాక్ డౌన్ వల్ల చాలా ఇండస్ట్రీలు మూతబడ్డాయి. లక్షల మంది జాబ్స్ కోల్పోయారు. కొందరి జీతాలు తగ్గాయి . కంపెనీలకు విపరీతంగా నష్టాలు వస్తున్నాయి. దీంతో వర్కర్లకు లేఆఫ్లు ప్రకటించారు. ఇలాంటి బాధితుల్లో 40 లక్షల మందికి తమ మూడు నెలల జీతంలో సగం మొత్తాన్ని
చెల్లిస్తారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ నాయక త్వంలోని జరిగిన ఈఎస్‌ఐ బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 41 లక్షల మందికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఈఎస్‌ఐ అంచనా వేసింది. ఎలిజబిలిటీ ఉన్న ఈఎస్‌ఐ సభ్యులు తాము చివరిగా తీసుకున్న జీతం మొత్తంలో సగాన్ని చెల్లిస్తామని ఈఎస్‌ఐ బోర్డు మెంబర్ అమర్త్‌జి కౌర్ వెల్ల
డించారు. మూడు నెలల మొత్తం పొందడానికి బాధితులు అర్హులని పేర్కొన్నారు. ఈ స్కీమ్ అమలు వల్ల ప్రభుత్వానికి రూ.6,700 కోట్లు ఖర్చవుతాయని ఆమె వివరించారు.
ఎవరు అర్హులంటే…
నెలకు జీతం రూ.21వేలలోపు ఉండి, ఈఎస్‌ఐకి చందా చెల్లించే ఇండస్ట్రియల్ వర్కర్లు ఈ స్కీమ్‌కు అర్హులు. జాబ్ పోవడానికి ముందు కనీసం రెం డేళపా్ల టు ఏదైనా కంపెనీలో పనిచేసి ఉండాలి. కనీసం ఆరు నెలలపాటు ఈఎస్‌ఐ చందా కట్టిఉండాలి. ఈఎస్‌ఐ సదుపాయం ఉన్న ఉద్యోగులకు వైద్యసదుపాయాలు కూడా ఉంటాయనే విషయం తెలిసిందే. వీరి బేసిక్ జీతంలో 0.75 శాతాన్ని ఈఎస్‌ఐకి కట్టాలి. మరో 3.25 శాతం మొత్తాన్ని కంపెనీ వీరి కోసం చెల్లిస్తుం ది. నిరుద్యోగ భృతి కోసం ఎంప్లాయర్ ఈఎస్‌ఐకి దరఖాస్తు పంపాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కోల్పోయిన వాళ్లు నేరుగా ఈఎస్‌ఐ బ్రాంచ్‌ఆఫీసులో దరఖాస్తు ఇవ్వాలి. అక్కడి ఆఫీసర్లే వెరిఫికేషన్ చేస్తారు. ఆధార్ సంఖ్య ద్వారా ఈ పనిని పూర్తి చేస్తారు. అటల్‌బీమా వ్యక్తి కల్యాణ్‌యోజన కింద నిరుద్యోగ భృతి చెల్లిస్తారు. 2018 నుంచే ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ వల్ల జాబ్స్‌పోవడంతో గత కొన్ని నెలల్లోదాదాపు 80 లక్షల మంది వర్కర్లు ఈఎస్‌ఐకి చందా కట్టడం మానేశారు. బాధితుల్లో చాలా మంది సొంతూళ్లకు వెళ్లి పోయారు. చాలా మంది అక్కడే వ్యవసాయ పనులు చేస్తుండగా, కొందరు మాత్రమే సిటీలకు తిరిగి వచ్చారు.