హాల్​టికెట్లు ఇయ్యలే.. పరీక్ష రాయలే

హాల్​టికెట్లు ఇయ్యలే.. పరీక్ష రాయలే
  • మలక్​పేట ముంతాజ్ ఇంజినీరింగ్ కాలేజీ నిర్వాకం

మలక్ పేట, వెలుగు: మలక్ పేటలోని ముంతాజ్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సకాలంలో హాల్ టికెట్లు ఇవ్వని కారణంగా బుధవారం ఒక సెకండియర్ స్టూడెంట్, 9 మంది ఫస్టియర్ స్టూడెంట్స్ సెమిస్టర్ తొలి పరీక్షను రాయలేకపోయారు. తొలుత పరీక్ష సమయం కావొస్తున్నా కాలేజీ యాజమాన్యం మరో గంటలో హాల్​టికెట్లు వస్తాయంటూ బుకాయించింది. చివరకు జేఎన్టీయూలో టెక్నికల్ సమస్యతో ఆలస్యమైనట్లు ప్రకటించింది. దీంతో బాధిత విద్యార్థులతో కలిసి వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల అడ్మిషన్లు అసలు ఉన్నాయా? లేవా? అని నిలదీశారు. ఎట్టకేలకు యాజమాన్యం సాయంత్రం బాధిత విద్యార్థులకు హాల్​టికెట్ల అందజేసింది. ఒక పరీక్ష మిస్స్ అవ్వగా, మిగిలిన పరీక్షలకు యథావిధిగా హాజరు కావాలని సూచించింది.