గోల్డ్ బార్లు, కాయిన్లకు హాల్‌‌‌‌‌‌‌‌మార్కింగ్ తప్పనిసరి!

గోల్డ్ బార్లు, కాయిన్లకు  హాల్‌‌‌‌‌‌‌‌మార్కింగ్ తప్పనిసరి!

న్యూఢిల్లీ: గోల్డ్‌‌‌‌‌‌‌‌ బార్లు, కాయిన్లు వంటి గోల్డ్ బులియన్‌‌‌‌కు హాల్‌‌‌‌‌‌‌‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ల్యాబ్‌‌‌‌‌‌‌‌లలో తయారయ్యే వజ్రాల కోసం  రెగ్యులేషన్స్ తీసుకురావాలని ఆలోచిస్తోంది. కన్జూమర్లను రక్షించడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోందని కన్జూమర్ అఫైర్స్‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీ నిధి ఖారా సీఐఐ జెమ్స్ అండ్ జ్యుయెలరీ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. 

40 కోట్ల కంటే ఎక్కువ జ్యుయెలరీ ఐటెమ్స్‌‌‌‌‌‌‌‌కు హాల్‌‌‌‌‌‌‌‌మార్కింగ్ గుర్తింపు ఉందని, యునిక్ హెచ్‌‌‌‌‌‌‌‌యూఐడీ నెంబర్ ఇష్యూ అయ్యిందని ఆమె తెలిపారు.  రిజిస్ట్రేషన్ చేసుకున్న జ్యుయెలర్ల సంఖ్య 1.95 లక్షలకు, హాల్‌‌‌‌‌‌‌‌మార్కింగ్ సెంటర్లు 1,600 చేరుకున్నాయన్నారు.