టూల్స్​ & గాడ్జెట్స్ : తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీలు కరిగించే.. స్కిప్పింగ్​ రోప్​

తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీలు కరిగించునేందుకు బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఎక్సర్​సైజ్​ స్కిప్పింగ్​. రన్నింగ్​, స్విమ్మింగ్, సైక్లింగ్​ లాంటివాటితో పోలిస్తే.. స్కిప్పింగ్​తో చాలా ఎక్కువ కొవ్వులు కరుగుతాయి. అందుకే ఎక్కువమంది స్కిప్పింగ్​ చేస్తుంటారు. అలాంటివాళ్లకు ఇది బెస్ట్‌‌‌‌‌‌‌‌ రోప్. హలోహోప్​ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ స్కిప్పింగ్ రోప్​ హ్యాండిల్​కు బ్యాక్‌‌‌‌‌‌‌‌లిట్ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే ఉంటుంది.

అందులో టైమర్, వెయిట్​, క్యాలరీలు, సర్కిల్స్​ డిస్​ప్లే అవుతాయి. జంప్ చేసే సర్కిళ్ల సంఖ్యను కచ్చితంగా లెక్కిస్తుంది. ఇందులో హై క్వాలిటీ -బాల్ బేరింగ్స్​, బేరింగ్ స్టెబిలైజర్లు ఉండడం వల్ల రోప్​ ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉండడంతోపాటు బెస్ట్‌‌‌‌‌‌‌‌ జంపింగ్ ఎక్స్​పీరియెన్స్​ ఇస్తుంది.  హ్యాండిల్​ను హై క్వాలిటీ, ఏబీఎస్​ మెటీరియల్‌‌‌‌‌‌‌‌తో తయారు చేశారు. యాంటీ–టాంగిల్ జంపింగ్ రోప్​ని ఉక్కు వైర్‌‌‌‌‌‌‌‌లతో తయారు చేశారు. పైన పీవీసీ మెటీరియల్‌‌‌‌‌‌‌‌తో కోటింగ్​ చేశారు.