ఢిల్లీ : బడ్జెట్‌కు ముందు ఏటా నిర్వహించే హల్వా వేడుకను ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న వారందరికీ హల్వా పంచిపెట్టారు. బడ్జెట్ తయారీ చివరి దశలో హల్వా వేడుక నిర్వహించడం స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి సంప్రదాయంగా వస్తోంది. ఫైనాన్స్ మినిస్ట్రీ కార్యాలయ ఆవరణలో జరిగిన హల్వా వేడుకలో ఆర్థిక మంత్రితో పాటు ఆ శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావ్, ఫైనాన్స్ మినిస్ట్రీకి చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.