‘హమారా బచ్పన్ ట్రస్ట్’ ఒడిసాలో నడుస్తోంది. ముఖ్యంగా గిరిజనులు ఎక్కువ ఉండే సుందర్‌ఘఢ్ జిల్లాలో ఈ ట్రస్ట్ మెంబర్స్ యాక్టివ్ గా పని చేస్తారు. కిందటి ఏడాది కొవిడ్ వల్ల జిల్లాలో చాలామంది అమ్మాయిల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో ఇంటి దగ్గర ఉన్న ఆడపిల్లలకు పెండ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. పదోతరగతి పూర్తి కాకముందే అమ్మాయిలకు పెండ్లి చేయడం తప్పని ఈ ట్రస్ట్ సభ్యులు ఆ జిల్లాలో పోరాడారు. తల్లిదండ్రులకు సరైన పని లేకపోవడం వల్ల చైల్డ్ మ్యారేజ్లు చేస్తున్నారని తెలుసుకున్నారు. దీంతో ఇటు పిల్లల్ని ఇతర ఆశ్రమ బడుల్లో చేర్చించడంతో పాటు తల్లిదండ్రుల లైఫ్ స్కిల్స్‌పైన కూడా దృష్టి సారించారు. ఇలా నవంబర్ 2020లో, జూన్ 2021 మధ్యలో అనేక కార్య క్రమాలు నిర్వహించారు. లైఫ్ స్కిల్స్, ఉపాధి మార్గాలు, కమ్యూనిటీ వర్క్‌షాప్‌లు నిర్వహించి శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని కిరిప్సిరా గ్రామానికి చెందిన భూమిలేని మహిళ నిరుపమ. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి ఆ కుటుంబానికి. బచ్పన్ ట్రస్ట్ ద్వారా పూలు అమ్మడం నేర్చుకుంది ఈమె. ఊళ్లు తిరుగుతూ రైతుల దగ్గర నుంచి పూలు కొని, అమ్ముతూ సొంతంగా డబ్బులు సంపాదించుకోగలిగింది. నిరుపమ లాంటి ఎంతోమంది కడుపునిండా తినగలుగుతున్నారు. వరి గడ్డిని సేకరించడం, పుట్టగొడుగులను పెంచడం, వ్యవసాయ పనుల్లో మెళకువలు నేర్పడం వంటివి ఈ ట్రస్ట్ చేస్తోంది. రెండేండ్లలో 6,077 మంది బాలికలకు లైఫ్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చారు. 3024 మంది మహిళలకు ఉపాధి చూపించారు. ఆ ట్రస్ట్‌లో ముఖ్యంగా కమ్యూనికేషన్, గోల్ సెట్టింగ్, హెల్త్, పలు రకాల హింసను గుర్తించడం, లీడర్షిప్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ వంటి అంశాలపై ట్రైనింగ్ ఇస్తారు.
‘‘ఆడవాళ్లు ఎదగాలంటే లైఫ్ స్కిల్ ట్రైనింగ్ ఎంతో అవసరం. వాళ్లకు ఆర్థిక స్వాతంత్ర్యం ఒక్కటే సరిపోదు, అన్ని రంగాల్లో అవకాశాలు ఉండాలి. అందుకోసం
వారికి స్కిల్స్ నేర్పించాలి. అందుబాటులో ఉన్న సోర్సులను ఉపయోగించడం, సవాళ్లను ఎదుర్కోవడం కోసం వారు నిర్ణయాలు తీసుకోగలగాలి’’ అని ట్రస్ట్ చైర్‌పర్సన్ ధరిత్రి పట్నాయక్ అన్నారు. ‘‘ఆడవాళ్లు ఎదగాలంటే లైఫ్ స్కిల్ ట్రైనింగ్ ఎంతో అవసరం. వాళ్లకు ఆర్థిక స్వాతంత్ర్యం ఒక్కటే సరిపోదు, అన్ని రంగాల్లో అవకాశాలు ఉండాలి. అందుకోసం వారికి స్కిల్స్ నేర్పించాలి. అందుబాటులో ఉన్న సోర్సులను ఉపయోగించడం, సవాళ్లను ఎదుర్కోవడం కోసం వారు నిర్ణయాలు తీసుకోగలగాలి’’ అని ట్రస్ట్ చైర్‌పర్సన్ ధరిత్రి పట్నాయక్ అన్నారు.