హమాస్ పెద్ద తలకాయ యాహ్యా సిన్వార్ హతమయ్యారా..? ఫొటోలు వైరల్..!

హమాస్ పెద్ద తలకాయ యాహ్యా సిన్వార్ హతమయ్యారా..? ఫొటోలు వైరల్..!

గాజా: ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడుల్లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ చనిపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. చనిపోయిన హమాస్ చీఫ్ ఫొటోలు ఇవేనంటూ నెట్టింట కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. గాజాలో ఐడీఎఫ్ జరిపిన ఆపరేషన్స్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని ఐడీఎఫ్ పేర్కొంది. చనిపోయిన ఆ ముగ్గురిలో ఒకరు హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ అవునో.. కాదో.. ఐడీఎఫ్, ఐఎస్ఏ నిర్ధారించే పనిలో ఉన్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆ ముగ్గురు ఉగ్రవాదుల ఐడెంటిటీని నిర్ధారించలేమని వెల్లడించింది.

IDF is checking finger prints, and DNA to confirm killing of Yahya Sinwar.
~ CNN pic.twitter.com/SEluOs2gfi

ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిన గాజాలోని ఆ బిల్డింగ్లో అక్టోబర్ 17, 2024న ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని, బందీలు ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఐడీఎఫ్ ప్రస్తుతం ఫింగర్ ప్రింట్స్, డీఎన్ఏను నిర్ధారించే పనిలో ఉంది. యాహ్యా సిన్వార్ హతమయ్యారనే వార్తలపై హమాస్ నుంచి కూడా ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ చనిపోయి ఉంటే.. ఇజ్రాయెల్ సైన్యానికి, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఇంతకు మించిన శుభవార్త మరొకటి ఉండకపోవచ్చు.

GRAPHIC WARNING

Photos out of Gaza on the interwebs purport to document the corpse of Hamas leader Yahya Sinwar. Is he really dead? We’ll soon know. For early confirmation, watch for an announcement of an official period of mourning from Harvard, Columbia, and UCLA. pic.twitter.com/kgtkgNspOZ

ఎందుకంటే.. ఇజ్రాయెల్ గత కొన్ని నెలల నుంచి హమాస్లో పెద్ద తలకాయలుగా ఉన్న ఒక్కొక్కరిని హతమారుస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ సైన్యం చేతిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతమయ్యారనే వార్త అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చనిపోయింది హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిర్ధారించనప్పటికీ సోషల్ మీడియాలో మెజార్టీ నెటిజన్లు హమాస్ చీఫేనని నిర్ధారించేస్తున్నారు. వైరల్ అవుతున్న ఫొటోలోని దంతాలను, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ దంతాలను పోల్చుతూ.. హతమయింది యాహ్యా సిన్వార్ అని తేల్చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్​కొనసాగిస్తూనే ఉంది. గాజాలో షెల్టర్​హోమ్గా మార్చిన స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 20 మంది చనిపోయారు. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఇజ్రాయెల్ ఫైటర్​జెట్లు బాంబులు వేశాయని స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన నెల రోజుల తర్వాత నుంచి ఈ స్కూల్ నిరాశ్రయులకు షెల్టర్​హోమ్గా ఉంటున్నదని వారు తెలిపారు.