హమాస్ కీలక టెర్రరిస్టును చంపేశాం: ఇజ్రాయెల్

జెరూసలె: హమాస్​టర్రరిస్టుల ఏరివేతలో భాగంగా కీలక కమాండర్​ను తుదముట్టించినట్లు ఇజ్రాయెల్ బలగాలు ప్రకటించాయి. హమాస్ స్నిఫర్ బలగాలను నియంత్రిస్తున్న టెర్రరిస్ట్, హమాస్ కమాండర్​ అహ్మద్​హసన్​సలామె అల్సౌర్కాను రాకెట్ దాడితో హతమార్చినట్లు వెల్లడించాయి. ఇజ్రాయెల్​ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్), ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఫోర్సెస్(ఐఎస్ఏ) ల నుంచి అందిన కచ్చితమైన సమాచారంతో నార్త్​ గాజాలోని అల్సౌర్కా నివసిస్తున్న బిల్డింగ్​పై రాకెట్ దాడి చేసినట్లు పేర్కొన్నాయి. 

బీట్ హనౌన్​ఏరియాలో అల్సౌర్కా ఉన్న భవంతిపై దాడికి పకడ్బందీగా ప్లాన్ చేశామని, గురితప్పకుండా టార్గెట్ ను ఛేదించామని ఐఎస్ఏ వివరించింది. ముందుజాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైన ఏర్పాట్లు చేయడం ద్వారా సాధారణ పౌరులకు ప్రాణహాని కలగకుండా పని పూర్తిచేసినట్లు తెలిపింది. ఈ దాడికి సంబంధించి ఐఎస్ఏ ఓ వీడియోను రిలీజ్ చేసింది. గాజాపై జరిపిన ఎయిర్​స్ట్రైక్​లో హమాస్​కు చెందిన ముఖ్య టెర్రరిస్ట్​ అహ్మద్​ హసన్​ అల్సౌర్కా  హతమైనట్టు ఇజ్రాయెల్​ రక్షణ దళాలు గురువారం వెల్లడించాయి.