జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ మధ్య మళ్లీ యుద్ధవాతావరణం నెలకొన్నది. కాల్పుల విరమణ, బందీల విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ హమాస్మరో దారుణానికి పాల్పడింది. తమవద్ద బందీలుగా ఉన్న ఆరుగురిని చంపేసింది. వీరి మృతదేహాలు లభ్యమైనట్టు ఇజ్రాయెల్వెల్లడించింది. దక్షిణ గాజాస్ట్రిప్‌లోని రఫా నగరంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో వీరి మృతదేహాలను గుర్తించినట్టు తెలిపింది. వీరిలో ఇద్దరు మహిళలు ఉండగా.. ఓ ఇజ్రాయెల్ అమెరికన్యువకుడు ఉన్నారు.
వారిని రక్షించేందుకు దళాలు అక్కడికి చేరుకునే కొద్ది గంటలముందే హమాస్అతికిరాతకంగా చంపేసినట్టు ఐడీఎఫ్ తెలిపింది. కాగా, ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మౌనం పాటించి, మృతులకు నివాళి అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హమాస్‌కు కాల్పుల విరమణ ఇష్టం లేనట్టున్నదని అన్నారు. ఆ మిలిటెంట్గ్రూప్ను నాశనం చేసేదాకా యుద్ధం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
తీవ్రంగా స్పందించిన బైడెన్
రఫాలోని సొరంగంలో ఇజ్రాయెల్ దళాలు గుర్తించిన ఆరుగురు మృతుల్లో ఒకరు ఇజ్రాయెలీ అమెరికన్ అయిన 23 ఏండ్ల హెర్ష్ గోల్డ్‌బర్గ్ పొలిన్ ఉన్నారు. అతడి తల్లిదండ్రులు తమ కుమారుడితో పాటు హమాస్ చెర నుంచి బందీలను విడిపించేందుకు తీవ్రంగా శ్రమించారు. కుమారుడి మరణవార్త తెలుసుకొని, వారు దిగ్భ్రాంతి చెందారు. కాగా, పొలిన్ మరణాన్ని జో బైడెన్ కూడా ధ్రువీకరించారు. తమ దేశ పౌరుడి మరణం పట్ల విచారం వ్యక్తంచేశారు. హమాస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అలాగే, ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సత్వరమే జరిగేలా కృషిచేస్తానని చెప్పారు.
మరో ఘటనలో ముగ్గురు ఇజ్రాయెల్పోలీసులు..
ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ పోలీస్ఆఫీసర్ల వాహనంపై పాలస్తీనా మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఇజ్రాయెల్పోలీసులు మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రాంతంలో రోజూ ఇజ్రాయెల్ దళాలు దాడులు సాగిస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు ఖలీల్ అల్ రెహ్మాన్ బ్రిగేడ్ అనే మిలిటెంట్ గ్రూప్ బాధ్యత వహించింది. ఇది తమ పనేనని ప్రకటించింది.
ఇజ్రాయెల్‌లో మిన్నంటిన నిరసనలు
బందీల మరణానికి ఇజ్రాయెల్‌ప్రధాని నెతన్యాహు కారణమంటూ ఆ దేశ ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. బందీల ప్రాణాల గురించి ఆయన పట్టించుకోవడం లేదని, హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్త ఆందోళనకు వారు పిలుపునిచ్చారు. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని, మిగతా బందీలనైనా హమాస్చెరనుంచి విడిపించాలని డిమాండ్ చేశారు.