హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ మృతి.. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటన

హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ మృతి..  ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటన

ఇరాన్‌లో హమాస్ గ్రూప్ చీఫ్, అక్టోబర్ 7 ఇజ్రాయిల్ పై దాడుల సూత్రధారి మహ్మద్ దీఫ్ చనిపోయినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. జూలైలో ఇజ్రాయిల్ చేసిన వైమానిక దాడిలో మరణించినట్లు ఎక్స్ వేదికగా నిర్థారించారు. జూలై 13న ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఫైటర్ జెట్‌లు ఖాన్ యునిస్ ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్స్ చేశాయని తెలిపింది. ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం.. ఆ దాడిలో మహ్మద్ చనిపోయాడని తేలింది. 

పాలస్తీనా కోసం పోరాడుతున్న హమాస్‌‌‌‌ మిలిటెంట్ సంస్థ చీఫ్‌‌‌‌ ఇస్మాయిల్‌‌‌‌ హనియా కూడా మంగళవారం హత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌‌‌‌లోని ఇంటిపై మంగళవారం జరిగిన దాడిలో అతడు చనిపోయినట్టు హమాస్​గ్రూప్ ధ్రువీకరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా ఇస్మాయిల్​మరణాన్ని కన్​ఫర్మ్ ​చేసింది. ఈ దాడిలో ఇస్మాయిల్​తో పాటు అతని బాడీగార్డ్‌‌‌‌ కూడా మృతి చెందినట్టు వెల్లడించింది.