ఇరాన్-మద్దతుగల టెర్రర్ గ్రూప్ హమాస్ ఆదివారం విడుదల చేయాలనుకున్న ముగ్గురు ఇజ్రాయెలీ బందీల పేర్లను విడుదల చేసింది. దీంతో రెండు గంటలకుపైగా ఆలస్యం తర్వాత హమాస్ చేసిన ప్రకటన..గాజా కాల్పుల విరమణ ప్రారంభానికి మార్గం సుగమం చేసింది. హమాస్ విడుదల చేయబోయే 33 మంది బందీల జాబితా వచ్చే వరకు గాజాలో పోరాటం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ఇంతకుముందు చెప్పింది. అయితే హమాస్ సోషల్ మీడియాలో బందీల పేర్లను ప్రచురించిన తర్వాత ఇజ్రాయెల్ నుండి ప్రస్తుతం ఎలాంటి స్పందన లేదు.
ALSO READ | ఇజ్రాయెల్, హమాస్ మధ్య డీల్ ఓకే
దాదాపు సంవత్సరన్నకాలంగా కొనసాగిన ఇజ్రాయెల్, హమాస్ మధ్య మారణహోమానికి ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడింది.. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తొలివిడత ఆరువారాల్లో బందీల విడుదల చేయాలని జో బైడెన్ చెప్పారు. ఈ క్రమంలో ఇజ్రాయిలీ బందీల హమాస్ విడుదల చేయనుంది.