హనుమకొండ సిటీ, వెలుగు : జిల్లాలో రోడ్డు భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య కోరారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ లో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
వరంగల్ ఎన్ఐటీ, ఇతర ఎన్జీవో సంస్థల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, రోడ్లు భవనాల శాఖ ఈఈ సురేశ్‌బాబు, డీసీపీలు రవీందర్, సలీమా, ఏసీపీలు కిషోర్ కుమార్, తిరుమల్, దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.