
హనుమకొండ, వెలుగు : టెన్త్ రిజల్ట్‌లో హనుమకొండ జిల్లాను ఫస్ట్ ప్లేస్‌లో నిలిపేందుకు ఆఫీసర్లు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, డీఈవో డాక్టర్ అబ్దుల్‌హైతో కలిసి బీసీ, సోషల్, ట్రైబల్, మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ ఆఫీసర్లతో బుధవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్త్ ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న తీరును ఆఫీసర్లు వివరించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ స్టూడెంట్లు ఒత్తిడికి గురికాకుండా చూడాలన్నారు. ప్రతి స్టూడెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు.