ఎల్కతుర్తి/ ధర్మసాగర్/ బచ్చన్నపేట, వెలుగు: జిల్లాల్లో బాధ్యతలు తీసుకున్న తర్వాత డీఎంహెచ్వోలు ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం హనుమకొండ డీఎంహెచ్‌వో అప్పయ్య ఎల్కతుర్తి, ధర్మసాగర్ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఎల్కతుర్తిలో ఆశా డే కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామాల్లో గర్భిణులకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. అనంతరం ఆయా ఆస్పత్రుల్లో మెడికల్ స్టోర్ లో మందుల లభ్యత, రికార్డులు తనిఖీ చేశారు.
ముప్పారంలో కొత్తగా నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని తనిఖీ చేసి, నిర్మాణ పనులు స్పీడప్చేయాలని చెప్పారు. జనగామ జిల్లా బచ్చన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని డీఎంహెచ్‌వో మల్లికార్జున్‌రావు తనిఖీ చేశారు. రికార్డులు, గదులను పరిశీలించారు. అక్కడ అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది టైం పాటించాలని సూచించారు. బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా వచ్చిన అధికారులను వైద్యులు, సిబ్బంది సన్మానించారు.