ప్లాస్టిక్‌‌‌‌ పట్టీ, ఫెవిక్విక్‌‌‌‌ వాడుతూ ఏటీఎంలో డబ్బులు చోరీ

ప్లాస్టిక్‌‌‌‌ పట్టీ, ఫెవిక్విక్‌‌‌‌ వాడుతూ ఏటీఎంలో డబ్బులు చోరీ
  •     మైనర్‌‌‌‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న హనుమకొండ పోలీసులు
  •     పరారీలో నలుగురు నిందితులు

వరంగల్‍, వెలుగు : ప్లాస్టిక్‌‌‌‌ పట్టీ, స్క్రూ డ్రైవర్‌‌‌‌, ఫెవిక్విక్‌‌‌‌ వాడుతూ ఏటీఎంల నుంచి ఖాతాదారుల డబ్బులను చోరీ చేస్తున్న ముఠాను హనుమకొండ పోలీసులు సోమవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌‌‌‌రెడ్డి వెల్లడించారు. ఉత్తర్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌ రాష్ట్రం ఫత్తేపూర్‌‌‌‌కు చెందిన శుభం, అతడి గర్ల్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌ ప్రియాంక బట్టల షాపుల్లో పనిచేసేవారు. జల్సాలకు అలవాటు పడిన వీరు వచ్చే జీతం సరిపోకపోవడంతో ఏటీఎంలలో డబ్బులు చోరీ చేసేందుకు ప్లాన్‌‌‌‌ చేశారు. ఇందులో భాగంగా ఓ ఏటీఎం వద్దకు వెళ్లి విత్‌‌‌‌ డ్రా చేసిన డబ్బులు బయటకు వచ్చే

మార్గానికి అడ్డుగా ఓ ప్లాస్టిక్‌‌‌‌ పట్టీ పెట్టి ఫెవిక్విక్‌‌‌‌తో అతికించి పక్కకు వెళ్లిపోయేవారు. ఎవరైనా ఖాతాదారుడు ఆ ఏటీఎంకు వచ్చి డ్రా చేసేందుకు ప్రయత్నించగా డబ్బులు నిందితుడు పెట్టిన పట్టీ వద్దకు వచ్చి ఆగిపోయేవి. ఈ విషయం తెలియని ఖాతాదారులు ఎంత సేపు వేచి ఉన్నా డబ్బులు బయటకు రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. తర్వాత నిందితులు ఏటీఎం వద్దకు వచ్చి ప్లాస్టిక్‌‌‌‌ పట్టీని తొలగించి అక్కడ ఆగిన డబ్బులను తీసుకెళ్లేవారు. 

మరో ఐదుగురికి ట్రైనింగ్‍

దుస్తుల షాప్‌‌‌‌లో పనిచేసే శుభం, ప్రియాంకకు అదే రాష్ట్రానికి చెందినశివ్‌‌‌‌ వీర్‌‌‌‌సింగ్‌‌‌‌, అనీశ్‌‌‌‌సింగ్‌‌‌‌, సత్యవీర్‍, ప్రియాంక సింగ్‌‌‌‌తో పాటు మరో మైనర్‍ పరిచయం అయ్యారు. వారిద్దరు జల్సాగా తిరగడం గమనించిన మిగతా ఐదుగురు ఆ రహస్యమేంటో తమకు కూడా చెప్పాలని అడిగారు. దీంతో నిందితుడు తాను చేస్తున్న చోరీల విషయం చెప్పడంతో పాటు వారిని ఏపీ, నాగపూర్‍, చంద్రపూర్‌‌‌‌ ప్రాంతాల్లో తిప్పుతూ చోరీలు ఎలా చేయాలో నేర్పించాడు. ఈ క్రమంలో హనుమకొండ నయీంనగర్‌‌‌‌ కెనరా బ్యాంక్‌‌‌‌ ఏటీఎంలో రూ.1000, వరంగల్‍ ఎంజీఎం ఎస్‌‌‌‌బీఐ ఏటీఎంలో రూ.10 వేలు

హనుమకొండ లోకల్‌‌‌‌ బస్‌‌‌‌ డిపో దారిలోని కెనరా ఏటీఎంలో రూ.6500, హనుమకొండ గెస్ట్‌‌‌‌హౌజ్‌‌‌‌ ప్రాంతంలోని కెనరా బ్యాంక్‌‌‌‌ ఏటీఎంలో రూ.1000, నయీంనగర్‍లో రూ.1000, హనుమకొండ పద్మాక్షి టెంపుల్‌‌‌‌ దగ్గర్లోని ఏటీఎంలో రూ. 5 వేలు చోరీ చేశారు. అకౌంట్‌‌‌‌లో నుంచి డబ్బులు కట్‌‌‌‌ అవుతున్నా, ఏటీఎం నుంచి బయటకు రాకపోవడంతో పలువురు ఖాతాదారులు బ్యాంక్‌‌‌‌ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలే వరుసగా జరుగుతుండడంతో బ్యాంక్‌‌‌‌ ఆఫీసర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో నిఘా పెట్టిన పోలీసులు సోమవారం ఉదయం హనుమకొండలో శివ్‌‌‌‌ వీర్‌‌‌‌సింగ్‌‌‌‌, అనీశ్‌‌‌‌ సింగ్‌‌‌‌తో పాటు మరో మైనర్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేశారు. అసలైన నిందితుడు శుభం, ప్రియాంక, సత్యవీర్‌‌‌‌, ప్రియాంక సింగ్‍ పరారీలో ఉన్నట్లు ఏసీపీ చెప్పారు. నిందితులను పట్టుకున్న హనుమకొండ సీఐ సతీశ్‌‌‌‌, సీసీఎస్‌‌‌‌ సీఐ అబ్బయ్య టీమ్స్‌‌‌‌ను ఏసీపీ అభినందించారు.