ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఓ కాలేజీ గేటు ముందు హ్యాండ్ గ్రెనేడ్, ఓ లెటర్లభ్యమయ్యాయి. స్థానికంగా ఈ ఘటన స్టూడెంట్లతో పాటు బాటసారులను ఆందోళనకు గురిచేసింది. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌కు 100 మీటర్లలో దూరంలో ఉన్న జీపీ మహిళా కళాశాల గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం ఉదయం గ్రెనేడ్, ఓ లెటర్‌ను పెట్టి వెళ్లారు. వాటిని గమనించిన కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు.
అనంతరం బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ వచ్చి ఆ గ్రెనేడ్‌ను నిర్వీర్యం చేసింది. కాగా, లెటర్లో ‘ఫాసిస్ట్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలి, శ్రామికవర్గ విద్యార్థుల ఉద్యమాన్ని, విద్యా హక్కును గౌరవించాలి, విద్యార్థులను కీర్తించాలి’ అని రాసి ఉంది. ఆ కాలేజీకి అత్యంత సమీపంలోనే రాజ్ భవన్, సీఎం అధికారిక నివాసం, మణిపూర్ పోలీసు హెడ్క్వార్టర్స్ఉండడం గమనార్హం. అయితే, ఇంఫాల్ లోయలోని కాలేజీ యాజమాన్యాలను బెదిరించడానికి దుండగులు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం కళాశాల విద్యార్థులు ఈ ఘటనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.