హ్యాండ్ శానిటైజర్ వాడుతున్నారా.. అయితే మీ బ్రెయిన్ దెబ్బతింటుంది..!

కరోనా తర్వాత అందరికీ అలవాటు అయిన శుభ్రత ఏంటో తెలుసా.. శానిటైజింగ్.. ముఖ్యంగా హ్యాండ్ శానిటైజర్ వాడకం.. అవును ఆఫీసులో ఉన్నా.. హోటల్ కు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా ఎక్కడికి వెళ్లినా.. ఏది ముట్టుకున్నా హ్యాండ్ జేబులోని హ్యాండ్ శానిటైజర్ తీసి.. రెండు చుక్కలు వేసుకుని శుభ్రంగా తుడుచుకోవటం.. ఇలా హ్యాండ్ శానిటైజర్ వల్ల మన బ్రెయిన్.. అదేనండీ బుర్రలోని కణాలు దెబ్బతింటాయంట.. ఈ విషయాన్ని ఒహియో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలోని మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్ మెంట్ చేసిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హ్యాండ్ శానిటైజర్ వల్ల మెదడులోని కణాలు ఎలా దెబ్బతింటాయో తెలుసుకుందాం..

మనుషుల మెదడులో ఒలిగోడెండ్రోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉంటాయి. మెదడు వేగంగా పని చేయటానికి, చురుగ్గా పని చేయటానికి ఈ కణాలు ఎంతో ఉత్తేజంగా పని చేస్తాయి. మెదడుకు వేగంగా సంకేతాలు పంపించటంలోనూ ఈ ఒలిగోడెండ్రోసైట్స్ కణాలు పని చేస్తాయి.

ప్రస్తుతం మనం ఉపయోగించే హ్యాండ్ శానిటైజర్స్, వైప్స్ లో కొన్ని రసాయనాలు ఉంటాయి. అవి క్రిములను చంపుతాయి. హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించిన తర్వాత ఆ వాసన ద్వారా.. మన చేతుల ద్వారా శానిటైజర్స్, వైప్స్ లోని రసాయనాలు ముక్కు ద్వారా లేదా మన చర్మం నుంచి శరీరంలోకి వెళతాయి. అలా వెళ్లిన రసాయనాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉన్న ఒలిగోడెండ్రోసైట్స్ కణాలను దెబ్బతీస్తున్నాయంట.. దీని వల్ల మెదడు చురుగ్గా పని చేయటం మానేస్తుందంట క్రమంగా.. 

ఒక్క హ్యాండ్ శానిటైజర్స్, వైప్స్ వల్ల మాత్రమే కాకుండా మన ఇంట్లోని దుస్తులపై ఉపయోగించే స్ర్పేలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఫర్నిచర్ వంటి గృహాపకరణాలకు శుభ్రత కోసం ఉపయోగించే రసాయనాలు కూడా ప్రమాదకరంగా మారాయంట. ఆయా వస్తువులపై రసాయనాలు ఉపయోగించిన తర్వాత.. వాటిని మనం తాకటం ద్వారా ఆయా రసాయనాలు మన శరీరంలోకి వెళుతున్నాయంట. అలా వెళ్లిన రసాయనాలు మన మెదడులోని కణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయంట.. 

సో.. అతి ముఖ్యంగా హ్యాండ్ శానిటైజర్ అనేది చాలా ప్రమాదం అని.. మెదడులోని కణాలను దెబ్బతీస్తుందని ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో.. ఒహియో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఇక నుంచి హ్యాండ్ శానిటైజర్ వాడాలా లేదా అన్నది మీరే తేల్చుకోండి.. ఆ తర్వాత మా బుర్ర పని చేయటం లేదు అంటే మాకు సంబంధం లేదు..