కాగజ్‌నగర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ వీడియో గ్రాఫర్కు తోటి వీడియో గ్రాఫర్లు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. కాగజ్నగర్పట్టణంలోని ఓల్డ్ కాలనీకి చెందిన సాయి మంచిర్యాలలో ఓ ప్రోగ్రాం ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో రాంగ్ రూట్లో వచ్చిన బైక్ ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
బాధితుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో స్పందించిన కాగజ్‌నగర్ ఫొటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు తమవంతుగా రూ.25 వేలు జమచేసి శుక్ర వారం అందించారు.