వికలాంగుల గుడిసెలను జేసీబీలతో కూల్చేశారు

  • అడ్డుకున్న  పలువురు అరెస్టు 

మహబూబాబాద్​​ అర్బన్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో వెలసిన వికలాంగుల గుడిసెలను మంగళవారం రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసులు తొలగించారు.  సర్వేనెంబర్​ 557లో ఉన్న ప్రభుత్వ భూమిలో గత కొంత కాలం కింద వికలాంగులు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.  మంగళవారం ఉదయం పోలీస్​బలగాలతో రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది  జేసీబీలతో వచ్చి గుడిసెలను తొలగిస్తుండగా వికలాంగులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. జేసీబీలకు అడ్డుపడిన వికలాంగులను పోలీసు, మున్సిపాలిటీ సిబ్బంది ఈడ్చుకెళ్లారు. 

ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.  ఒక గుడిసెకు నిప్పు పెట్టారు. అయితే రెవెన్యూ సిబ్బంది పెట్టారని వికలాంగులు ఆరోపిస్తుండగా, వారె గుడిసెకు నిప్పుపెట్టుకున్నారని సిబ్బంది చెబుతున్నారు. రూ.కోట్ల ప్రభుత్వ భూములు అక్రమించుకున్న అధికార పార్టీల లీడర్లను వదిలేసి, తమగుడిసెలను తొలగిస్తున్నారని  వికలాంగులు ఆరోపిస్తున్నారు.